హీరోలా స్టంట్.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకేసిన మూడో త‌ర‌గ‌తి పిల్లోడు.. ఆ త‌ర్వాత ఏమైందీ

హీరోలా   స్టంట్.. స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకేసిన మూడో త‌ర‌గ‌తి పిల్లోడు.. ఆ త‌ర్వాత ఏమైందీ

కాన్పూర్: సినిమాల ప్రభావం పిల్లలపై ఎంత ఉంటుందో ఈ సంఘటన ఉదాహరణ.  పిల్లలు, యువతీయువకులు సినిమాల్లో నటీనటుల హావభావాలు, డైలాగ్, డ్యాన్సులు, ఫైటింగ్ ఇలా  సినిమా నటీనటులను అనుకరిస్తుంటారన్న విషయం మనకు తెలుసు. ముఖ్యంగా పిల్లలు స్పైడర్ మ్యాన్, హీమ్యాన్, సూపర్ మ్యాన్ లాంటి పాత్రలకు ఇమిటేట్ చేస్తుంటారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ సినిమాలో  హృతిక్ రోషన్ పాత్ర క్రిష్ పిల్లలను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.. అయితే  ఇటీవల కాన్పూర్ లో క్రిష్ పాత్ర ఓ విద్యార్థిని ఎంతగానో ఆకట్టుకుందట.. ఎనిమిదేళ్ల ఈ కుర్రాడు.. క్రిష్ లాగే స్టంట్స్ చేసి చివరికి ప్రాణాలమీదికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కాన్పూర్‌ కు చెందిన డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల విద్యార్థి.. ప్రముఖ బాలీవుడ్ చిత్రం క్రిష్‌లోని సాహసోపేతమైన స్టంట్‌ను అనుకరించేందుకు ప్రయత్నించిన ఘటన అందరిని షాక్ కు గురి చేసింది. కాన్పూర్ పరిధిలోని అనిల్ కాలనీకి చెందిన ప్రముఖ డ్రగ్గిస్ట్ కుమారుడైన ఈ విద్యార్థి  పాఠశాల మొదటి అంతస్తు రెయిలింగ్ నుండి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాలలోని సీసీటీవీలో రికార్డైంది.

బుధవారం  ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాల సమయంలో మంచినీరు తాగుతాగుతానని చెప్పి బయటకి వచ్చిన ఈ విద్యార్థి.. క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్ లాగా విన్యాసాలను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎత్తైన భవనం నుంచి దూకి, సురక్షితంగా నేలపై చేరుకున్నటువంటి ఫీట్‌ను ప్రదర్శించబోయి  ఆ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. దాదాపు 15 అడుగుల ఎత్తులో ఉన్న భవనం మొదటి అంతస్తు రెయిలింగ్ ఆ విద్యార్థి దూకాడు.. దురదృష్టవశాత్తు కాళ్లు, ముక్కు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆ విద్యార్థిని పాఠశాల యాజమాన్యం సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ విషాద ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఫుటేజ్ లో విద్యార్థి  భవనంపై నుంచి జంప్ చేయడాన్ని చేయడం, తీవ్రంగా గాయపడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే  ఆ విద్యార్థి నిర్ణయం వెనక ఎవరి ప్రమేయం లేదని.. సహ విద్యార్థులు అక్కడ ఉన్నప్పటికీ వారి బలవంతమేమి లేదని పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే విద్యార్థి తల్లి తెలిపిన విషయాలు అందరికి ఆశ్యర్యం కలిగించాయి.. తరుచుగా క్రిష్ ను సూపర్ హీరోగా చెప్పడం, అతని స్టంట్స్ చేయాలనే కోరిక ఉందని తల్లికి ఆ విద్యార్థి  చెప్పేవాడట.

 

कानपुर

कक्षा 3 के छात्र ने स्कूल बिल्डिंग से लगाई छलांग

स्कूल की पहली मंजिल से लगाई छलांग, गंभीर घायल

सुपर हीरो पर बनी फिल्म कृष से प्रेरित होकर लगाई छलांग

छात्र के मुंह, पैर में आई गंभीर चोट, अस्पताल में भर्ती

सीसीटीवी में कैद हुई पूरी घटना@kanpurnagarpol pic.twitter.com/I1MIvdXR3N

— Adv Karuna sharma (@asiamanchnews) July 21, 2023