JNU ఘటనలో ట్విస్ట్.. అనుమానితుల్లో అయిషీ ఘోష్

JNU ఘటనలో ట్విస్ట్.. అనుమానితుల్లో అయిషీ ఘోష్

జేఎన్ యూ లో దాడి ఘటనలో తొమ్మిది మంది ఫోటోలను రిలీజ్ చేశారు ఢిల్లీ పోలీసులు. అనుమానితుల్లో జేఎన్ యూఎస్ యూ ప్రెసిడెంట్ అయిషీ ఘోష్ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. చుంచున్ కుమార్, పంకజ్ మిశ్రా, ఐషే ఘోష్ , వాస్కర్ విజయ్, సుచేతా తాలూక్రాజ్, ప్రియా రంజన్, డోలన్ సావంత్, యోగేంద్ర భరద్వాజ్, వికాస్ పటేల్ నిందితులు దాడికి పాల్పడ్డట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడకి సంబంధించి మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు చెప్పారు.

అయితే దాడికి పాల్పడిన వారిలో పోలీసులు తన పేరును చేర్చడంపై అయిషీ ఘోష్ స్పందించారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని..భయపడేది లేదన్నారు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుల జాబితాలో చేర్చారన్నారు. పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టాలన్నారు. తనపై దాడికి సంబంధించిన సాక్షాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యంగా తమ ఉద్యమం కొనసాగిస్తామన్నారు.