నేషనల్, స్టేట్ లెవల్ పోటీలకు హార్వెస్ట్ స్టూడెంట్స్ ఎంపిక

నేషనల్, స్టేట్ లెవల్ పోటీలకు హార్వెస్ట్ స్టూడెంట్స్ ఎంపిక

ఖమ్మం టౌన్, వెలుగు : పాకబండ బజార్ లోని హార్వెస్ట్ స్కూల్ స్టూడెంట్స్ నేషనల్, స్టేట్ లెవెల్ లో జరిగే గేమ్స్ కు ఎంపికయినట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ పి.రవి మారుత్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈనెల 5నుంచి 8వరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో  నిర్వహించిన అండర్ 17 బాయ్స్ క్రికెట్ పోటీలలో స్టూడెంట్ బి.శ్రీజన్ జాతీయ స్థాయిలో ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈనెల 9న వరంగల్ లో జరిగిన అండర్ 19 అథ్లెటిక్స్ విభాగంలో బడ్డి వైశాలి 100, 200 మీటర్లతోపాటు లాంగ్ జంప్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 3 గోల్డ్ మెడల్స్ సాధించినట్లు తెలిపారు. త్వరలో మహారాష్ట్ర లో జరిగే నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికయినట్లు చెప్పారు. స్టేట్ లెవెల్ లో అండర్14, 17, 19 టేబుల్ టెన్నిస్, నెట్ బాల్, త్రో ఇతర గేమ్స్ లో మరికొందరు స్టూడెంట్స్ సెలెక్ట్ అయినట్లు తెలిపారు. వారిని రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతి రెడ్డి అభినందించారు.