హైదరాబాద్ నారాయణ కాలేజీలో స్టూడెంట్ సూసైడ్

హైదరాబాద్ నారాయణ కాలేజీలో స్టూడెంట్ సూసైడ్

మార్కులు తక్కువ వచ్చాయని నారాయణ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ మాదాపూర్ లోని అయ్యప్ప సోసైటిలో నారాయణ కాలేజీ రామానుజన్ క్యాంపస్ లో శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి ఐఐటీ లాంగ్ టర్మ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో విజయ్ మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికిచేరుకున్నా పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విజయ్ మృతి పట్ల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.