- విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఘోరంగా వైఫల్యం చెందిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిందని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ (నేతలు విడివిడిగా ప్రకటనల్లో ఆగ్రహం వ్యక్తం చేశాయి. నీట్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. నీట్ లీక్ తో నష్టపోయిన అభ్యర్థులకు కేంద్రం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాజస్తాన్‌లో నీట్ పేపర్ లీకేజీ జరగడం ముమ్మాటికి ఎన్టీఏ అధికారుల నిర్లక్ష్యమేనని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి విమర్శించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను లాక్కొని, విద్యను కేంద్రీకరించడంతోనే పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, అందుకే వరుసగా లీకేజీలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షడు రజినీకాంత్ విమర్శించారు.
