హయ్యర్​ స్టడీస్ చేసేందుకు విద్యార్థుల్లో క్రేజ్

హయ్యర్​ స్టడీస్ చేసేందుకు విద్యార్థుల్లో క్రేజ్

హైదరాబాద్, వెలుగు: ఫారిన్ చదువులపై స్టూడెంట్స్ ఇంట్రెస్ట్​ పెట్టారు. మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్‌లు కొట్టాలని చూస్తున్నారు.  రెండేండ్లుగా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లంతా ఈఏడాది ఎలాగైనా వెళ్లాలని రెడీ అవతున్నారు.  ప్రస్తుతం సమ్మర్, ఫాల్ ఇంటెక్ లకు అప్లికేషన్లు ఎక్కువగా చేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే స్టూడెంట్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ ఉందని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఉన్నత విద్య చదివేందుకు జనవరిలో స్ప్రింగ్​ఇంటెక్​తో పాటు మే నుంచి ఆగస్ట్ వరకు సమ్మర్ ఇంటెక్, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఫాల్ ఇంటెక్‌లు ఉంటాయి. ప్రస్తుతం సమ్మర్, ఫాల్ ఇంటెక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉందని  పేర్కొంటున్నారు.  

యూఎస్, యూకేలకే ఎక్కుగా.. 

జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్, సాట్ వంటి టెస్ట్ లు అటెంప్ట్​చేయాలి. అందులో క్వాలిఫై అయి మంచి స్కోర్ వస్తేనే వెళ్లేందుకు చాన్స్​ఉంటుంది.  దీంతో పాటు లాంగ్వేజ్ టెస్ట్ లు, ప్రాక్టికల్, థియరీ  టైస్టులు ఉంటాయి.  అమెరికా, కెనడా, యూకే, సింగపూర్, ఫ్రాన్స్, స్వీడన్ లోని యూనివర్సిటీల్లో ఇప్పటికే అడ్మిషన్ల ప్రాసెస్ మొదలైంది. ఎక్కువగా అమెరికా, యూకే  వెళ్లాలని స్టూడెంట్స్ ప్రయత్నిస్తున్నారు.  యూఎస్ లోని యూనివర్సిటీల్లో సమ్మర్ ఇంటెక్ అడ్మిషన్లు ఇప్పటికే అయిపోయాయి. యూకే, ఆస్ట్రేలియాలకు ఎక్కువ డిమాండ్ ఉందని, సమ్మర్ కాకపోతే ఫాల్ ఇంటెక్‌ కు అయినా వెళ్లాలని స్టూడెంట్స్ భావిస్తున్నారని గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఎండీ శ్రీకర్ ఆలపాటి చెప్పారు. 

తెలుగు రాష్ట్రాల నుంచి..

ఏటా మనదేశం నుంచి హయ్యర్​స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు 8 లక్షల వరకు ఉంటారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 50 వేలమందికి పైగా ఉంటారు. రెండేండ్లుగా కరోనా కారణంగా యూనివర్సిటీలు అడ్మిషన్లు క్లోజ్ చేయడం, వివిధ ఆంక్షలు, పలు కారణాల వల్ల లక్షలమంది వెళ్లలేకపోయారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడడం వీసా ప్రాసెసింగ్ కూడా అవుతుండడం, వర్సిటీలు అడ్మిషన్లు కొనసాగిస్తుండగా తెలుగు విద్యార్థులు మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 

ఫాల్​ ఇంటెక్ వెళ్లేందుకే..

గతేడాదితో పోలిస్తే యూకేకి వెళ్లాలని అప్లై చేసుకున్న వారు 60 శాతం, యూఎస్ కి 25 నుంచి 30శాతం మంది పెరిగారు. యూఎస్ కు ఆన్​లైన్​ వీసా స్లాట్స్ అందుబాటులో లేవు. దీంతో యూకే కు క్రేజ్ పెరిగింది. ఆస్ట్రేలియాకు కూడా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. సమ్మర్ ఇంటెక్ లో వెళ్లేందుకు చాలామంది రెడీ అవగా లిమిటెడ్ ఎడిషన్ ఉండగా తక్కువగా వెళ్తుంటారు. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉండే ఫాల్ ఇంటెక్ కు వెళ్లేందుకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్​పెట్టారు. 
- శ్రీకర్ ఆలపాటి, ఎండీ, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ

ఆగస్టులో వెళ్తున్నా.. 

లాస్ట్ ఇయర్ యూఎస్ వెళ్లి కంప్యూటర్ సైన్స్ చేయాలనుకున్నా. అప్పటి పరిస్థితులతో ఇంట్లో వాళ్లు పంపించలేదు. ఇప్పుడు సమ్మర్ ఇంటెక్​కు ట్రై చేశా. యూఎస్ వెళ్లేందుకు కుదరలేదు. వీసా ప్రాసెస్ లేట్ అయింది. అందుకే ఫాల్ ఇంటెక్ లో వెళ్లాలనుకుంటున్నా.  టెక్సాస్ వర్సిటీలో సీటొచ్చింది. ఆగస్ట్ లో వెళ్లేందుకు రెడీ అవుతున్నా.