ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నిరసన సెగ

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నిరసన సెగ

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి విద్యార్థుల నిరసన సెగ తగిలింది. ఫీజు రీయింబర్స్మెంట్ సహా స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ శ్రీ అనంత పద్మనాభ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

కాగా బీజేపీ తమను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ రోహిత్ రెడ్డి ఇటీవలె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము బీజేపీలో చేరాలంటూ ఫాంహౌస్లో రూ.100 కోట్ల డీలింగ్ జరిగిందని, మిగతా ఎమ్మెల్యేలను కూడా తీసుకువస్తే రూ.50కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ ముగ్గురిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ముగ్గురు ఒత్తిడి తెచ్చారని, డీలింగ్ లో భాగంగానే వాళ్లు తన ఫామ్ హౌస్ కు వచ్చారని ఫిర్యాదు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సిట్ విచారణను వేగవంతం చేసింది.