విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు : వివేక్ వెంకటస్వామి

విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు : వివేక్ వెంకటస్వామి

విద్యార్థులు క్రమశిక్షణ..పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సికింద్రాబాద్ హరిహర కళా భవన్ లో నిర్వహించిన శ్రీసాయి విజ్ఞాన్ భారతి కళాశాల 32వ వార్షిక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. స్టూడెంట్స్ కు నాణ్యమైన విద్యను అందిస్తున్న కాలేజీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే వివేక్ అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి.