జేఎన్టీయూ, జర్మనీ వర్సిటీల మధ్య ఎంఓయూపై విద్యార్థుల ఆందోళన

జేఎన్టీయూ, జర్మనీ వర్సిటీల  మధ్య ఎంఓయూపై విద్యార్థుల ఆందోళన
  • పుకార్లు నమ్మొద్దన్న వీసీ కిషన్​కుమార్​రెడ్డి

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూ, జర్మనీ యూనివర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందాల వల్ల విద్యార్థులకు ఆర్థిక భారం పెరుగుతుందని మంగళవారం ఏబీవీపీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జర్మనీలో ఎటువంటి అనుభవం లేని యూనివర్సిటీలతో జేఎన్టీయూ ఒప్పందం కుదుర్చుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. జేఎన్టీయూ నేరుగా అక్కడి యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోకుండా మధ్యవర్తుల ద్వారా కుదుర్చుకోవటం అపోహలను పెంచుతుందన్నారు. కాగా, ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు దశాబ్దాలుగా జేఎన్టీయూ అనేక ఒప్పందాలను చేసుకొని సక్సెస్ అయ్యిందన్నారు. ఇటీవల జర్మనీలోని రోట్లింజన్, క్యాసెల్​ వర్సిటీలతో బీటెక్, మాస్టర్స్​ డిగ్రీల కోసం ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ ఒప్పందం మేరకు జర్మనీలో చదివే విద్యార్థుల పూర్తి బాధ్యత జేఎన్టీయూ తీసుకుంటుందని వివరించారు. ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని, పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరారు.