బడిలేక బాయి కాడికి..

బడిలేక బాయి కాడికి..

కరోనా వైరస్ ప్రభావంతో బడులకు తాళాలు పడ్డాయి. దాదాపు నాలుగు నెలలుగా స్టూడెంట్లంతా ఇంటి పట్టునే ఆటపాటలతో కాలం వెల్లదీస్తున్నరు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు వ్యవసాయ సీజన్ ‌కావడంతో తమ తల్లిదండ్రులతో పొలానికి పోతున్నారు. అమ్మనాన్నలతో పాటు వరినాట్లు, పొలం పనులు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. మెదక్ మండలం చిట్యాల, జానకంపల్లి, పేరూరు గ్రామాల్లో ఆదివారం అలాంటి దృశ్యాలే కనిపించాయి. – మెదక్ టౌన్, వెలుగు