వర్క్ ఫ్రం హోం పేరుతో స్టూడెంట్స్ కు వల

వర్క్ ఫ్రం హోం పేరుతో స్టూడెంట్స్ కు వల

మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్
మల్కాజిగిరి, వెలుగు: వర్క్​ఫ్రం హోం పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. చిలకలగూడలో ఉండే మనుకుల శాలిని(24), బార్గె బాలరాజు(30) అనే వ్యక్తితో కలిసి వర్క్​ఫ్రం హోం అనే సంస్థను స్టార్ట్ చేసింది. నెలకు రూ.8వేలు జీతం ఇస్తామని నమ్మబలికింది. ఈ విషయం తెలుసుకున్న మల్లాపూర్, అశోక్ నగర్ లో ఉండే తాడూరి మౌనిక(21) అనే విద్యార్థిని శాలినిని కలిసి జాయిన్ అయ్యింది. జాయినింగ్ ఫీజు కింద రూ.2,500 కట్టింది. అలాగే తన స్నేహితులకు వారంలో 90 షీట్లను ఎటువంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి ఇస్తే ఒక్కో షీటుకు రూ.90 చొప్పున వస్తాయని చెప్పి జాయిన్ చేయించింది.
30 మంది జాయిన్ అయ్యారు.

నెలల గడుస్తున్నా జీతాలు ఇవ్వకుండా సాకులు చెబుతూ తప్పించుకుని తిరిగారు. బాధితులు శనివారం మల్కాజిగిరి పోలీసులకు కంప్లయింట్ చేశారు. నిందితులను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు  తరలించారు.