సీటింగ్ కోసం గొడవ.. గ్యాంగ్స్ గా విడిపోయి కొట్టుకున్న స్టూడెంట్స్

సీటింగ్ కోసం గొడవ.. గ్యాంగ్స్ గా విడిపోయి కొట్టుకున్న స్టూడెంట్స్

కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 'ఎక్స్' హ్యాండిల్ 'ఘర్ కే కాలేష్' అనే పేజీలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో, ఇద్దరు విద్యార్థులు సీటింగ్ కారణంపై ఒకరినొకరు క్రూరంగా కొట్టుకోవడం చూపిస్తుంది. అలెన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అబ్బాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, నెట్టడం కూడా ఇందులో చూడవచ్చు.

ఈ వీడియోకు దాదాపు 50వేల వ్యూస్ వచ్చాయి. అలెన్‌లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం అని చాలా మంది ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. అయితే మరికొందరు మాత్రం ఇది WWE మ్యాచ్ లాగా అనిపించిందంటూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

అంతకుముందు, ఇటీవల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్‌లో జరిగిన వార్షిక క్రీడా కార్యక్రమంలో రెండు కబడ్డీ జట్ల సభ్యుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తీవ్రమైన ఘర్షణను చూపించే వీడియో కూడా ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఇది ఈవెంట్ పూర్తిగా గందరగోళంగా ఎలా మారిందో చూపిస్తుంది. ఈ వైరల్ వీడియో, అనేక మంది ఒకరినొకరు కొట్టుకోవడం, కుర్చీలు విసరడాన్ని చూపించింది. ఘర్షణకు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, ఢిల్లీలోని నేతాజీ సుభాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ (NSUT), JC బోస్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (YMCA) విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని పలు నివేదికలు సూచిస్తున్నాయి.