క్వశ్చన్ పేపర్ల లీకేజీలతో స్టూడెంట్ల జీవితాలు నాశనం : వేముల రామకృష్ణ

క్వశ్చన్ పేపర్ల లీకేజీలతో స్టూడెంట్ల జీవితాలు నాశనం : వేముల రామకృష్ణ
  •     బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ

ముషీరాబాద్, వెలుగు : క్వశ్చన్​పేపర్ల లీకేజీలతో స్టూడెంట్లు, నిరుద్యోగుల జీవితాలు నాశనం అవుతున్నాయని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 20 లక్షల మందికి పైగా రాస్తున్న నీట్​పేపర్ లీక్​అవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సోమవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్​లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..

రాత్రి, పగలు అనే తేడా లేకుండా లక్షల మంది ఎగ్జామ్స్ కు ప్రిపేర్​అవుతుంటే.. కొందరు దొడ్డి దారిలో సీట్లు కైవసం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఫలితంగా బడుగు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులు మౌనం వీడి, నీట్​కౌన్సిలింగ్ ను నిలిపివేయాలని కోరారు. నీట్ అభ్యర్థులకు బీసీ విద్యార్థి సంఘం అండగా ఉంటుందని చెప్పారు.