ఆటల్లోనూ సత్తా చాటుతున్న కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల స్టూడెంట్లు

ఆటల్లోనూ సత్తా చాటుతున్న కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల స్టూడెంట్లు

ముషీరాబాద్, వెలుగు: బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్లు జాతీయ స్థాయి ఆటల పోటీల్లోనూ సత్తా చాటుతున్నారు. అంబేద్కర్ కాలేజీలో బీకామ్ థర్డ్ ఇయర్ చదువుతున్న కొమరవెల్లి మిథిలేశ్ ఈ నెల 20న జరిగిన 36వ షోటోకాన్ చాంపియన్ షిప్–2022లో గోల్డ్ మెడల్​తో పాటు గ్రాండ్ చాంపియన్ షిప్ టైటిల్​ను దక్కించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరి 27 నుంచి 29 వరకు జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోవాలో జరగనున్న 40వ జాతీయ స్థాయి పోటీల్లోనూ మిథిలేశ్ పార్టిసిపేట్ చేయనున్నాడు. ఈ సందర్భంగా అంబేద్కర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, స్టాఫ్​ కరాటే క్రీడాకారుడు మిథిలేశ్​ను అభినందించారు. చదువుతో పాటు ఆటల్లోనూ స్టూడెంట్లు రాణించేలా ప్రోత్సహిస్తున్నామని వారు తెలిపారు.