డ్రగ్స్ కేసు ఎంక్వైరీ ఏమైంది? : కేంద్ర మంత్రి బండి సంజయ్

డ్రగ్స్ కేసు ఎంక్వైరీ ఏమైంది? : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్న​

హైదరాబాద్, వెలుగు: గతంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని, అప్పట్లో సిట్ చీఫ్ గా ఉన్న అకున్ సబర్వాల్ ను ఎందుకు తప్పించారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేవలం పండుగలు వచ్చినప్పుడే ప్రభుత్వానికి డ్రగ్స్ సోదాలు గుర్తుకు వస్తాయా అని ఎద్దేవా చేశారు. 

గతంలో డ్రగ్స్ కేసులో అనేకమంది సినీ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయని, విచారణలో నిందితులు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లను కూడా ప్రస్తావించారని ఆరోపించారు. కేవలం ఆ కుటుంబ సభ్యుల భవిష్యత్తు నాశనం అవుతుందనే భయంతోనే నాటి కేసీఆర్ ప్రభుత్వం అకున్ సబర్వాల్​ను అర్ధంతరంగా తప్పించి, కేసును నీరుగార్చిందని సంజయ్ మండిపడ్డారు. డ్రగ్స్ కేసును పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.