చిన్నమ్మతో సహ జీవనం.. ఇదేంటని అడిగినందుకు అన్న మర్డర్

చిన్నమ్మతో సహ జీవనం.. ఇదేంటని అడిగినందుకు అన్న మర్డర్

కామారెడ్డి​, వెలుగు: చిన్నమ్మ వరుసయ్యే ఓ మహిళతో యువకుడు సహజీవనం చేస్తున్నాడు. ఇదేమిటని ప్రశ్నించిన తన అన్నను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్​పల్లిలో జరిగింది. భిక్కనూరు ఎస్సై అంజనేయులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. మోటాట్​పల్లికి చెందిన ఎర్ర నరసయ్యకు ఇద్దరు కొడుకులు రాజు, శివకుమార్ ఉన్నారు. శివకుమార్ వరుసకు చిన్నమ్మ అయ్యే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను రెండేళ్ల క్రితం గ్రామం నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్లి సహజీవనం చేస్తున్నాడు.

ఈ విషయంలో కుటుంబంలో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గ్రామంలో రాజు, శివకుమార్ మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం రాజు(32) మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. శివకుమార్​ బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ సంపత్​కుమార్​, ఎస్సై అంజనేయలు పరిశీలించారు. ఈ ఘటనపై వివిధ కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. శివకుమార్​ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.