కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని ప్రధాన రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రూ.60 కోట్లతో చేపట్టే 60 ఫీట్ల రోడ్డు విస్తరణకు గతంలో అధికారులు మార్కింగ్ వేశారు. శనివారం రోడ్డు విస్తరణలో కోల్పోతున్న 200 నిర్మాణాల వాల్యూవేషన్ను ఆర్అండ్ బీ, మున్సిపల్ అధికారులు లెక్కించారు. సీఎం ఇంటి నుంచి వినాయక చౌరస్తా, శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా బాపల్లి చౌరస్తా వరకు 18 కి.మీ. మేర రోడ్డు విస్తరణ చేపట్టనున్నట్లు ఏఈ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. వాల్యూవేషన్ పూర్తికాగానే నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
