పార్టీ జెండా మోసిన వారికే పదవులు : మెట్టు సాయికుమార్

పార్టీ జెండా మోసిన వారికే పదవులు : మెట్టు సాయికుమార్

వనపర్తి, వెలుగు: పార్టీలో మొదటి నుంచి ఉంటూ జెండా మోసిన వారికే పదవులు వస్తాయని ఫిషరీస్  కార్పొరేషన్  చైర్మన్, జిల్లా సమన్వయకర్త మెట్టు సాయికుమార్ తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీసీసీ పూర్తి కార్యవర్గాన్ని జనవరి మొదటి వారంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

కార్యవర్గంలో సీనియర్లకు, అన్నివర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్  బలంగా ఉందని, మెజారిటీ  సర్పంచ్  స్థానాలు సాధించడమే దీనికి నిదర్శనమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. టికెట్లు రాని వారికి, సీనియర్లకు నామినేటెడ్  పదవులు ఇస్తామన్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, శంకర్ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్, ధనలక్ష్మి, శంకర్ నాయక్, చంద్రమౌళి, యాదయ్య పాల్గొన్నారు.

పెబ్బేరు: శ్రీరంగాపూర్​లోని రంగనాయకస్వామిని మెట్టు సాయికుమార్​ దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తంజావూరు పెయింటింగ్స్ ను సందర్శించారు. టీపీసీసీ బీసీ విభాగం ఉపాధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య పాల్గొన్నారు.