అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వనవీర’. సిమ్రాన్ చౌదరి హీరోయిన్‌గా నటించగా, నందు విలన్‌గా కనిపించనున్నాడు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్‌పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మించారు. జనవరి 1న థియేట్రికల్ రిలీజ్ కానుంది.
‘వానర’ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ సూచనలతో ‘వనవీర’గా విడుదల చేస్తున్నారు. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. అవినాష్ వాళ్ల ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్. ఇప్పుడు అవినాష్ హీరోగానే కాకుండా ఈ సినిమాను డైరెక్ట్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెబుతున్నా’ అని అన్నారు.
అవినాష్ తిరువీధుల మాట్లాడుతూ ‘మా ట్రైలర్ రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరంకు థ్యాంక్స్. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. మైథాలజీ టచ్ ఉంటుంది. ఈ సినిమా ఎవరినీ నిరాశపర్చదు అనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాం’ అని చెప్పాడు. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఫన్, మిస్టరీ, థ్రిల్లింగ్, రొమాన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని సిమ్రాన్ చౌదరి చెప్పింది. మంచి కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నామని నిర్మాత శంతను పత్తి అన్నారు. నటులు హర్ష, బాబీ, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ పాల్గొన్నారు.
