న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓ ద్వారా రూ.11 వేల కోట్లు సేకరించేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో కొత్త షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ఉంటుంది. దీనికి సంబంధించి ఈ వారంలోనే డీఆర్హెచ్పీ దాఖలు చేసే అవకాశం ఉంది. జెప్టో ఇటీవల పెట్టుబడిదారుల నుంచి 450 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. దీనితో సంస్థ మొత్తం నిధులు 2.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
గత నిధుల సేకరణ సమయంలో కంపెనీ విలువ ఏడు బిలియన్ డాలర్లుగా ఉంది. సంస్థ వ్యవస్థాపకులు ఆదిత్ పలీచా, కైవల్య వోహ్రాతో పాటు సీఎఫ్ఓ రమేష్ బాఫ్నాను పూర్తిస్థాయి డైరెక్టర్లుగా నియమించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో జెప్టో నష్టాలు 177 శాతం పెరిగి రూ.3,367.3 కోట్లకు చేరాయి.
