కళామహోత్సవ్​లో స్టూడెంట్ల సందడి

కళామహోత్సవ్​లో స్టూడెంట్ల సందడి

సికింద్రాబాద్ , వెలుగు: రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఈశాన్య రాష్ర్టాల కళామహోత్సవం వేడుకల్లో మంగళవారం యువ త సందడి చేశారు. బుధవారం నుంచి దసరా పండుగ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో డిగ్రీ,ఇంటర్ కాలేజీల విద్యార్థులు వేడుకలను సందర్శించారు. విద్యార్థులు ఈశాన్యరాష్ర్టాల కళలు, కళాకారుల ప్రదర్శనలు ,సంప్రదాయ నృత్యాలు చూస్తూ వారి సం స్కృతిని గురించి తెలుసుకున్నారు. మిలటరీ సిబ్బంది, అధికారులు , క్యాడెట్స్​ సికింద్రాబాద్​, ఏఓసీ నుంచి తమ కుటుంబ సభ్యలతో కలిసి మహోత్సవ్​ను సందర్శించారు. ఈశాన్య రాష్ర్టాల ప్రజల జీవన శైలిని తెలిపే చేనేత, హస్తకళావస్త్రాలు, అల్లినబుట్టలు,హ్యాండ్​ బ్యాగులు, తయారీ విధానం ఆకట్టుకున్నాయి.