రేప్ కేసులో దోషిని కఠినంగా శిక్షించాలె

V6 Velugu Posted on Sep 13, 2021

  • కేయూ స్టూడెంట్ యూనియన్ల డిమాండ్

హనుమకొండ సిటీ, వెలుగు: హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారి రేప్, మర్డర్ కేసులో నిందితుడైన రాజును కఠినంగా శిక్షించాలని కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ల నాయకులు, గోపాలపూర్ సేవాలాల్ బంజారా సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్​ చేశారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ ఆదివారం హనుమకొండలో వేర్వేరుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. బంజారా సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ దారావత్ రాంచందర్ నాయక్, విజయ, శారద, భారతి తదితరులు  పాల్గొన్నారు. 

Tagged students, protest, rape case, Punish,

Latest Videos

Subscribe Now

More News