
పద్మారావునగర్, వెలుగు: ప్రతి పేద విద్యార్థి మంచి సైంటిస్టు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అక్షయ విద్యా ఫౌండేషన్ ఆశయం చాలా గొప్పదని కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ ఎస్.రాజీవ్ కొనియాడారు. ఖాళీగా ఉన్న కంటోన్మెంట్ స్కూల్ భవనంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన సైన్స్‌సెంటర్ ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు.
ప్రస్తుతం ట్విన్ సిటీస్ లో మొత్తం 140 అక్షయ విద్యా లెర్నింగ్ సెంటర్లు విజయవంతంగా నడుస్తున్నాయని, ఇందులో 4 వేల మంది స్టూడెంట్లు ప్రతి రోజు సాయంకాలం చదువు నేర్చుకుంటున్నారని అక్షయ విద్యా ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సీఈవో మధుకర్‌నాయక్, ప్రతినిధులు పాల్గొన్నారు.