విద్యార్థులు రీసెర్చ్ లో రాణించాలి : సరోజ వివేక్

విద్యార్థులు రీసెర్చ్ లో రాణించాలి :  సరోజ వివేక్

ముషీరాబాద్,వెలుగు : నిత్య జీవితంలో సైన్స్ పాత్రను తెలుసుకొని విద్యార్థులు పరిశోధనల్లో రాణించాలని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ సరోజ వివేక్ సూచించారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని కాలేజీలో నేషనల్ సైన్స్ డే ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జె. రుక్మిణి, జి. సరోజ వివేక్ హాజరై సైన్సు ప్రాముఖ్యతను వివరించారు.  సైన్స్ రంగంలో శాస్త్రవేత్తల పరిశోధనలు  సమాజ పురోగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. సైన్స్ రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సైన్స్ అధ్యాపకులు, విద్యార్థులు,  ఇనిస్టిట్యూషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.