బస్సుల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

బస్సుల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్

చేవెళ్ల, వెలుగు: బస్సులు పెంచడంతోపాటు సమయపాలన పాటించాలని కోరుతూ సోమవారం చేవెళ్ల మండలంలోని కమ్మెట ఎక్స్ రోడ్​పై విద్యార్థులు బైఠాయించారు. బస్సులు సరిపడా లేకపోవడంతో సమయానికి విద్యాసంస్థలకు చేరుకోలేకపోతున్నామని, క్లాస్​లు సైతం మిస్సవుతున్నామని వాపోయారు. ఆర్టీసీ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.