
- మంచినీళ్లు కూడా ఉండట్లేదంటూ స్టూడెంట్ల ఆవేదన
మెహిదీపట్నం, వెలుగు: మాసబ్ ట్యాంక్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ)లో ఇటీవల ప్రారంభమైన క్యాంటీన్ నామ్ కే వాస్తేగా తయారైం
దని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. స్టూడెంట్ల ఆందోళనల కారణంగా ఎట్టకేలకు గత సోమవారం వర్సిటీ అధికారులు క్యాంటీన్‌ను ప్రారంభించారు. అయితే, క్యాంటీన్ మెయింటెనెన్స్ టెండర్ దక్కించుకున్న నిర్వాహకుడు క్వాలిటీ ఫుడ్ అందించట్లేదని స్టూడెంట్లు చెబుతున్నారు.
మెనూకు తగ్గట్టుగా ఫుడ్ తయారు చేయడం లేదంటున్నారు. సిబ్బంది కొరత, అనుభవం లేని వంట మాస్టర్స్‌తో క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. క్యాంటీన్‌లో తాగడానికి కనీసం మంచినీళ్లు ఉంచడం లేదని.. దీనిపై ప్రశ్నిస్తే వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ నిర్వాహకులు అల్టిమేటం జారీ చేస్తున్నారని స్టూడెంట్లు వాపోయారు..