
బీఎడ్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఇప్పటి వరకు BA, BCOM,BSC కోర్సులు చదివిన వారే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(B.Ed ) చేరే అవకాశం ఉంది. అయితే..ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారు కూడా B.Ed లో చేరవచ్చు. BCA,BBM,BA (ఓరియంట్ లాంగ్వేజెస్) BBA, BTech చేసిన వారు కూడా B.Ed చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా డిగ్రీల్లో 50% మార్కులు సాధించి ఉండాలని ఉత్తర్వుల్లో తెలిపింది. SC,ST,BC అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే B.Ed చేసేందుకు అర్హులుగా ప్రకటించింది.