థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన స్టూడెంట్స్

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన స్టూడెంట్స్

ములుగు జిల్లా వడ్డెరగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల మందు కలకలం రేపింది. ముగ్గురు స్టూడెంట్స్ థమ్సప్ అనుకొని పురుగులు మందు తాగారు. లంచ్ సమయంలో అక్షర, అఖిల, ఐశ్వర్య అనే స్టూడెంట్స్ పొరపాటున పురుగుల మందు తాగారు. మందు వాసన రావడంతో గమనించిన టీచర్.. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.