దయ్యం భయంతో హాస్టల్ ఖాళీ చేసిన విద్యార్థినిలు

దయ్యం భయంతో హాస్టల్ ఖాళీ చేసిన విద్యార్థినిలు

నిన్నటి వరకు ఆ హాస్టల్‎లో వంద మందికి పైగా విద్యార్థినిలుండేవారు. కానీ, ఇప్పుడు ఒక్కరు కూడా లేకుండా ఖాళీగా మారింది. విద్యార్థినులందరూ భయంతో ఇంటి బాట పట్టారు. పాఠశాల సిబ్బందేమో హోంసిక్ అంటుండగా.. విద్యార్థినిలు మాత్రం వేరే కారణం చెబుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది?

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఆదర్శ కళాశాల ఉంది. ఆ కళాశాల హాస్టల్‎లో 100 మందికి పైగా విద్యార్థినిలుంటున్నారు. వీరంతా మంగళవారం రాత్రి స్టడీ అవర్స్‎లో భాగంగా చదువుకుంటుండగా.. గదిలో ఒక నీడ కనిపించింది. దాంతో విద్యార్థినిలంతా తీవ్రంగా భయపడ్డారు. గదిలో దయ్యం కనిపించిందని, వెనుకనుంచి తోసేసినట్టుగా అనిపించిందని, వింత శబ్దాలు వినిపించాయని విద్యార్థులు చెప్పారు. ఈ ఘటనతో భయపడిన విద్యార్థినిలు హాస్టల్ ఖాళీ చేసి ఇళ్ళకు వెళ్లిపోయారు. అయితే స్టూడెంట్లు హోమ్‌సిక్‌‎తోనే వెళ్లిపోయారని.. వారంతా తిరిగి రాగానే కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని మోడల్‌ స్కూల్‌ సిబ్బంది అంటున్నారు.