
పర్వతగిరి(ఐనవోలు), వెలుగు: తమ స్కూల్లో టీచర్లు లేరని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు స్టూడెంట్స్గురువారం పోస్టు కార్డులు రాశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో స్కూల్లో 468 మంది స్టూడెంట్స్ఉన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 8మంది టీచర్లుండగా, 6నుంచి 10వ తరగతి వరకు ఒక్క టీచర్ ఉండగా ఎస్ఎంసీ( స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్ పొన్నాల రాజు, స్థానికులు కలిసి కొద్ది రోజులుగా ప్రైమరీ టీచర్లను హైస్కూల్ స్టూడెంట్స్కు చెప్పిస్తున్నారు. ప్రైమరీ స్టూడెంట్లకు ప్రైవేటు టీచర్లను ఏర్పాటు చేశారు. దీంతో స్కూల్కు ఏడుగురు స బ్జెక్టు టీచర్లు, హెడ్మాస్టర్, పీఈటీ అవసరముందని స్టూడెంట్లు పోస్టు కార్డులు రాశారు.