
క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్నప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి.అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ (IARC) ప్రకారం..2022లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి.9.7 మిలియన్ క్యాన్సర్ సంబంధిత మరణాలు సంభవించాయి. అటువంటి ప్రాణాంతమైక వ్యాధిని నివారించడం ఎలా..?
క్యాన్సర్‌ను నియంత్రించడంలో,దాని ప్రభావాన్ని తగ్గించడంలో వ్యాయామం ఒక కీలకమైన చర్యగా మారుతోందంటున్నారు పరిశోధకులు.ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం ఇటీవల చేసిన పరిశోధనలు ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. వ్యాయామం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఎలా సహాయపడుతుందో వెల్లడించాయి. ఈ అధ్యయనం ఆధారంగా క్యాన్సర్ నివారణలో వ్యాయామం ప్రాముఖ్యత ,దానిని రోజువారీ జీవనంలో ఎలా అమలు చేయవచ్చో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు ఫ్రాన్సిస్కో బెట్టారిగా నేతృత్వంలోని అధ్యయనం ప్రకారం..వ్యాయామం సమయంలో కండరాలు విడుదల చేసే మయోకిన్‌లు (ప్రోటీన్లు) క్యాన్సర్ కణాల పెరుగుదలను 20-నుంచి30శాతం తగ్గిస్తాయి. ఈ మయోకిన్‌లు క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
రెసిస్టెన్స్ ట్రైనింగ్, HIIT:
రెసిస్టెన్స్ ట్రైనింగ్ (వెయిట్ లిఫ్టింగ్, బాడీవెయిట్ వ్యాయామాలు) ,హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) ఒకే సెషన్‌లో మయోకిన్ స్థాయిలను పెంచుతాయి. రొమ్ము క్యాన్సర్ బాధితులపై జరిగిన అధ్యయనంలో వ్యాయామం ముందు, వెంటనే, 30 నిమిషాల తర్వాత మయోకిన్ స్థాయిలలో స్థిరమైన పెరుగుదల కనిపించింది.
చికిత్సలో వ్యాయామం:
క్యాన్సర్ చికిత్స సమయంలో లేదా ఆ తర్వాత వ్యాయామం చేయడం శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది,మరణ రేటును తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. రొమ్ము, కొలొరెక్టల్, ప్రోస్టేట్ క్యాన్సర్ రోగులలో వ్యాయామం మనుగడ రేటును మెరుగుపరుస్తుందని ఆధారాలు సూచిస్తున్నాయి.
వ్యాయామం ప్రయోజనాలు
క్యాన్సర్ కణాల నిరోధం: మయోకిన్‌లు క్యాన్సర్ కణాల విభజనను నిరోధిస్తాయి ,ట్యూమర్ పెరుగుదలను తగ్గిస్తాయి.
రోగనిరోధక శక్తి: వ్యాయామం రోగనిరోధక కణాల (NK సెల్స్, T-సెల్స్) యాక్టివిటీని పెంచుతుంది.
మానసిక ఆరోగ్యం: వ్యాయామం ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.ఇవి క్యాన్సర్ రోగులలో సాధారణం.
జీవన నాణ్యత: చికిత్స సమయంలో అలసటను తగ్గించి, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఊబకాయం నియంత్రణ: అధిక బరువు క్యాన్సర్ రిస్క్‌ను పెంచుతుంది కాబట్టి, వ్యాయామం బాడీ మాస్ ఇండెక్స్ (BMI) నియంత్రణలో సహాయపడుతుంది.
వ్యాయామం రకాలు ,సిఫారసులు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ,క్యాన్సర్ నిపుణుల సిఫార్సుల ఆధారంగా..క్యాన్సర్ నివారణ ,చికిత్సలో వ్యాయామం కీలక చర్య.
రెసిస్టెన్స్ ట్రైనింగ్:
వెయిట్ లిఫ్టింగ్, రెసిస్టెన్స్ బ్యాండ్స్, బాడీవెయిట్ వ్యాయామాలు (పుష్-అప్స్, స్క్వాట్స్). వారానికి 2-నుంచి 3 సెషన్లు, 20నుంచి -30 నిమిషాలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
హై-ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT):
తీవ్రమైన వ్యాయామం (స్ప్రింటింగ్, జంపింగ్ జాక్స్) ,విశ్రాంతి తో కూడిన సెషన్లు. ఈ వ్యాయామం వారానికి 2 సెషన్లు చేస్తే చాలు.15నుంచి -20 నిమిషాలు.
ఏరోబిక్ వ్యాయామం: వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఈత. వారానికి 150 నిమిషాల మోడరేట్ ఏరోబిక్ వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన ఏరోబిక్ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
యోగా ,స్ట్రెచింగ్: ఒత్తిడి తగ్గించడానికి ,శరీర సౌలభ్యాన్ని పెంచడానికి యోగా, పైలేట్స్ వంటి వ్యాయామం అవసరం. వారానికి 2నుంచి -3 సెషన్లు, 20నుంచి -30 నిమిషాలు చేయాలి
క్యాన్సర్ రోగులకు వ్యాయామం సిఫార్సులు
వ్యాయామం ప్రారంభించే ముందు ఆంకాలజిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవాలి.
చికిత్స దశ, రోగి శారీరక సామర్థ్యం ఆధారంగా వ్యాయామం రూపొందించాలి.
తక్కువ నుంచిప్రారంభం: 10నుంచి -15 నిమిషాల చిన్న సెషన్లతో ప్రారంభించి క్రమంగా పెంచడం.
సురక్షిత వాతావరణం: గాయాలను నివారించడానికి సరైన సామగ్రి (షూస్, మ్యాట్స్) ఉపయోగించడం.
చికిత్స సమయంలో: కీమోథెరపీ లేదా రేడియోథెరపీ సమయంలో తక్కువ తీవ్రత వ్యాయామాలు వాకింగ్, స్ట్రెచింగ్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.