సిద్దిపేట జిల్లాలో ఆసక్తికర ఘటన: ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే ఉప సర్పంచ్ రాజీనామా

సిద్దిపేట జిల్లాలో ఆసక్తికర ఘటన: ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే ఉప సర్పంచ్ రాజీనామా

హైదరాబాద్: ఉప సర్పంచ్‎గా ప్రమాణ స్వీకారం చేసి పట్టుమని 10 రోజులు కూడా కాకుండానే ఉప సర్పంచ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. ఇటీవల జరిగిన పంచాతీయ ఎన్నికల్లో దుబ్బాక (మం) ఆకారం గ్రామ ఉప సర్పంచ్‎గా గోపాల్ ఎన్నికయ్యాడు. ఉప సర్పంచ్ ఎన్నికలో తనకు మద్దతిస్తే వార్డు సభ్యులకు డబ్బులు ఇస్తానని గోపాల్ ఒప్పుకున్నాడు.

పదవి చేపట్టి రోజులు గడుస్తున్నా ఒప్పందం మేరకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉప సర్పంచ్ గోపాల్‎ని నిలదీశారు వార్డు సభ్యులు. దీంతో మనస్థాపనానికి గురైన గోపాల్ ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేశాడు. గోపాల్ రాజీనామా వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మద్దతు ఇస్తే డబ్బులు ఇస్తానని హామీ ఇవ్వడమేంటి.. డబ్బులు ఇవ్వలేదని వార్డ్ మెంబర్స్ నిలదీయడంతో రాజీనామా చేయడమేంటని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.