‘శుభం’ నిజమైన సక్సెస్: సమంత

‘శుభం’ నిజమైన సక్సెస్: సమంత

హీరోయిన్‌‌‌‌‌‌‌‌ సమంత నిర్మాతగా నిర్మించిన మొదటి సినిమా ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో   హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించారు. మే 9న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం ఆనందంగా ఉందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌‌‌‌‌‌‌‌లో సమంత మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో పదిశాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంది. ఇంత ధైర్యంగా ఎలా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చానా అనుకున్నా.

24 క్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌లో భాగమవడం చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే ప్రొడ్యూసర్స్ మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తారని అర్ధమైంది. నాకిది  నిజమైన సక్సెస్.  ప్రేక్షకులకు  క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమా తీశాం. ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. టీమ్ అంతా చాలా కష్టపడింది.

ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పింది. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ ‘నమ్మకంతో  సినిమా తీశాం. ఈ విజయంలో నా టీమ్ అందరి పాత్ర ఉంది. సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ విజయంలో భాగమవడం చాలా ఆనందంగా ఉందని నటీనటులు చెప్పారు.