కేబుల్ నెట్ ఎక్స్ పోలతో  సాంకేతక పరిజ్ఞానం పెంపు

కేబుల్ నెట్ ఎక్స్ పోలతో  సాంకేతక పరిజ్ఞానం పెంపు

హైదరాబాద్: కేబుల్ రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్లకు పరిచయం చేసే లక్ష్యంతో ఈ నెల 26 నుంచి 28 వరకు సీఎంసి కేబుల్ నెట్ ఎక్స్ పో   నిర్వహిస్తున్నట్లు ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ  ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, రాము తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ప్రపంచవ్యాప్తంగా నెట్వర్కింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఆ దిశగా కేబుల్ ఆపరేటర్లు ముందడుగు వేయాలనే లక్ష్యంతో పదేళ్ల నుంచి ఎక్స్ పోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైటెక్స్ లో జరగనున్న ఈ ఎక్స్ పోలో 250  స్టాల్స్ లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్ల అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆపరేటర్లు పాల్గొని విజయవంతం చేయాలని సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.