
సుహాస్ హీరోగా అర్జున్ వై కె దర్శకత్వంలో జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రసన్న వదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్. మే3న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్మాత జెఎస్ మణికంఠ మాట్లాడుతూ ‘నేను కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు కో ప్రొడ్యూసర్‌గా చేశాను. అర్జున్ చెప్పిన కథ నచ్చి సుహాస్‌కు వినిపిస్తే తనకూ నచ్చింది. ఫేస్ బ్లైండ్ నెస్ అనే కాన్సెప్ట్‌తో మన దేశంలో సినిమాలు రాలేదు. చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా తీశాం. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా ఉంటుంది. తెలుగు పరిశ్రమకి దక్కిన అదృష్టం సుహాస్. చాలా మంది దర్శకులు తనను దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తున్నారు. తనతో వర్క్ చేయడం గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక సుకుమార్ గారి దగ్గర పనిచేసినప్పటికీ అర్జున్ ప్లెక్సిబుల్‌గా ఉంటాడు. చాలా అద్భుతంగా ఈ మూవీ తీశాడు. తను భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడు. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. బిజినెస్ పరంగా లాభాల్లో ఉన్నాం. మైత్రీ, హోంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేయడం ఆనందంగా వుంది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సుహాస్‌తోనే ఉంటుంది’ అని చెప్పాడు.