మహిళలపై అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు

మహిళలపై అలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు

రోడ్లను తన చెంపలతో పోలుస్తూ మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ హేమమాలిని స్పందించారు. గతంలో లాలూ ప్రసాద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. ఇంకా చాలామంది నేతలు అదే ట్రెండ్ ను కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. కానీ అలాంటి వ్యాఖ్యలు వినడానిక అంత బాగుండవన్నారు. అలాంటి వ్యాఖ్యలను తాను పెద్దగా పట్టించుకోను కానీ.. మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ నేతలకు మంచిదికాదని హితవు పలికారు.

ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర మంత్రి గులాబ్ రావు పాటిల్ జల్గావ్ జిల్లాలోని తన నియోజకవర్గంలోని రోడ్లను హేమమాలినితో పోల్చాడు.  తన నియోజకవర్గంలో  రోడ్లు హేమమాలిని బుగ్గల్లా నున్నగా ఉన్నాయని కామెంట్ చేశారు. ప్రతిపక్షాలు కూడా ఒక్కసారి వచ్చి చూడాలన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు  వ్యక్తం అయ్యాయి.  ఈ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. మంత్రి గులాబ్ రావు చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చాలా మంది చేశారన్నారు. గతంలో లాలూ ప్రసాద్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. హేమమాలిని అంటే అందరికీ గౌరవమని..ఈ విషయాన్ని నెగెటివ్ గా చూడొద్దన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హేమమాలిని ఇలాంటి వ్యాఖ్యలు వినడానికి అంతగా బాగుండవని అన్నారు.  కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ కు చెందిన ఓ మంత్రి కూడా తన నియోజకవర్గంలోని రోడ్లను  కత్రినా కైఫ్ బుగ్గలతో పోల్చాడు.

మరిన్ని వార్తల కోసం

ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి