ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఓటర్, ఆధార్ అనుసంధాన బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

ఆధార్ కార్డుతో ఓటర్ కార్డ్ అనుసంధాన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.  విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు సభ ఆమోదం పొందింది. విపక్షాలు ఆధార్, ఓటర్ అనుసంధానం బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. ఇది గోప్యతకు భంగం కలిగిస్తుందన్నారు కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బిల్లు ఉందన్నారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఆధార్ రెసిడెన్స్ ప్రూఫ్ మాత్రమేనని.. సిటిజన్ షిప్ ప్రూఫ్ కాదన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ప్రతిపక్షాల వాదనలు తీవ్రంగా ఖండించింది కేంద్రం. బోగస్ ఓట్లను తొలగించేందుకే బిల్లు తెచ్చామన్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. దీంతో సభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు.

 

మరిన్ని వార్తల కోసం

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి

బూస్టర్ డోసుకు అనుమతివ్వండి