సుచితది ఆత్మహత్యనే..! పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

సుచితది ఆత్మహత్యనే..! పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

సంగారెడ్డి, వెలుగు:  సంగారెడ్డి జిల్లాలో వివాహిత గుండెపోటుతో చనిపోలేదని, సూసైడ్ చేసుకున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. కొండాపూర్ సీఐ సుమన్ తెలిపిన ప్రకారం.. మల్కాపూర్‎కు చెందిన ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ , సుచిత దంపతుల మధ్య కొన్నాళ్లుగా ఆస్తి అమ్మకాలు, ఇతర విషయాల్లో గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో ఆదివారం కూడా వీరి మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరింది.  సుచిత ఇంట్లో బెడ్రూమ్ లో  ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయింది. 

దీంతో ఏం చేయాలో తోచని భర్త శ్రీనివాస్  తన భార్య గుండెపోటుతో చనిపోయిందని చెప్పి.. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించాడు. సుచిత మెడ చుట్టూ గాట్లు కనిపించడంతో ఆమె కుటుంబసభ్యులకు, బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించగా రిపోర్టులో సుచిత ఉరేసుకుని చనిపోయినట్టు తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సుమన్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.