హైదరాబాద్ క్లబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్ క్లబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు
  • మా దగ్గర రూల్స్ జాన్తానై అంటున్న పలు క్లబ్బులు
  • తనిఖీల్లో బయటపడ్డ క్లబ్బుల బండారం
  • చాలా క్లబ్బుల్లో నో  రూల్స్ ఫైర్ సేఫ్టీ పరికరాలు పనిచేయడం లేదు

సికింద్రాబాద్  క్లబ్  లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలోని క్లబ్బుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. రూల్స్ పాటించని క్లబ్బులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల సికింద్రాబాద్ క్లబ్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా పాటించకపోవడంతోనే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీంతో ఫైర్ సెఫ్టీ అధికారులు సిటీలో ముఖ్యమైన 15 క్లబ్బులపై ఫోకస్ పెట్టారు. రెండు రోజులుగా తనిఖీలు చేశారు. కంట్రీ క్లబ్, డక్కన్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, FNC క్లబ్, జూబ్లీక్లబ్, జింఖానా క్లబ్ తో పాటు మరిన్ని క్లబ్బుల్లో సోదాలు చేశారు. 
క్లబ్బులో తనిఖీల సందర్భంగా ఎన్నో విషయాలు బయటపడ్డాయి. చాలా క్లబ్బులు ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించడం లేదని గుర్తించి నోటీసులు ఇచ్చారు. కొన్ని క్లబ్బుల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలున్నా అవి పని చేయడం లేదని గుర్తించారు. గడువు ముగిసినా మార్చకపోవడంతో కొన్ని తుప్పు పట్టాయి. కొన్ని క్లబ్బుల్లో కేవలం గ్యాస్ స్ప్రే చేసే మిషన్లు మాత్రమే ఉన్నాయి. దీంతో సీరియస్ అయిన ఫైర్ సేఫ్టీ అధికారులు.. రూల్స్ పాటించాలని ఆదేశించారు. తనిఖీల్లో ఓపెన్ స్పేస్ తో పాటు స్టెయిర్ కేస్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగ్గా ఉన్నాయా లేవా అనే అంశాలు పరిశీలించామన్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. కొన్ని క్లబ్స్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్వోసీని రెనివల్ చేయించుకోలేదని గుర్తించామని చెప్పారు. నిబంధనలు పాటించని వాటికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. 
సాధారణంగా 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న వాణిజ్య సముదాయాలు, 18 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విద్యాసంస్థల భవనాలు, సినిమాహాళ్లు వంటివి అగ్నిమాపక శాఖ నుంచి ఖచ్చితంగా ఎన్వోసీ తీసుకోవాలి. అయితే ఈ నిబంధనలను చాలా మంది పాటించడం లేదు. కేవలం అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేసి, తర్వాత మరిచిపోతున్నారని జనం విమర్శిస్తున్నారు. పబ్స్, క్లబ్స్, షాపింగ్ మాల్స్, గోడౌన్లలో తనిఖీలు చేయడం లేదంటున్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

రెప్పపాటులో తప్పిన విమాన ప్రమాదం

84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన