రెప్పపాటులో తప్పిన విమాన ప్రమాదం

V6 Velugu Posted on Jan 19, 2022

బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రెప్పపాటులో రెండు ఇండిగో విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. జనవరి 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

జనవరి 7న బెంగళూరు నుంచి కోల్ కతాకు వెళ్లే 6E455, బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన  6E246 ఇండిగో విమానాలు 5 నిమిషాల వ్యవధిలో టేకాఫ్ అయ్యాయి. ఈ రెండు విమానాలు గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఒకదానికొకటి దగ్గరగా వచ్చాయి. విషయం గ్రహించిన రాడార్ సిబ్బంది రెండు ఫ్లైట్లలోని పైలెట్లను అప్రమత్తం చేశారు. దీంతో విమానాలు ఢీకొనే ముప్పు తప్పింది. ఘటన జరిగిన సమయంలో ఫ్లైట్లు 3వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. బెంగళూరు - కోల్కతా విమానంలో 176 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది ఉండగా.. బెంగళూరు భువనేశ్వర్ ఫ్లైట్ లో 238 మంది ప్యాసింజర్లు ఆరుగురు సిబ్బందితో కలిపి 426 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. 

ఇండిగో విమాన ఘటనకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లాగ్ బుక్ లో ఎంట్రీ చేయలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ఏవియేషన్ రెగ్యులేటరీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 

ఇవి కూడా చదవండి..

గజ్వేల్ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి

84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా

Tagged Bengaluru, National, Runway, kempagowda airport, indigo flights

Latest Videos

Subscribe Now

More News