గజ్వేల్ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
V6 Velugu Posted on Jan 19, 2022
సిద్దిపేట: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసులు పెరుగుతున్నందున అందరూ స్వీయ ఆత్మ రక్షణ చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. హాస్పిటల్ లో కోవిడ్ పేషెంట్ లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. కరోనాని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి హరీష్ తెలిపారు.
ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు వీలుగా 2 కోట్ల టెస్ట్ కిట్లు, ఒక కోటి హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధంగా ఉంచామన్నారు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికి హోం ఐసోలేషన్ కిట్లను అందిస్తున్నామన్నారు. ఐసోలేషన్ కోసం సిద్దిపేటలో ఆక్సిజన్ సౌకర్యంతో వంద పడకల హాస్పిటల్ సిద్దం చేశామన్నారు.
ఇవి కూడా చదవండి
84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా
ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన
Tagged Telangana, hospital, siddipet, tour, Harish rao, Health Minister, gajwel, visit, inspection