84 మంది ట్రైనీ ఐఏఎస్లకు కరోనా

V6 Velugu Posted on Jan 19, 2022

  • ముస్సోరి ఐఏఎస్ ఐఏఎస్ ట్రైనింగ్ క్యాంప్లో కలకలం 

డెహ్రాడూన్: దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. ఉత్తరాఖండ్  రాష్ట్రంలో కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముస్సోరిలో ఉన్న ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీ (లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) లో శిక్షణ పొందుతున్న 84 మంది ఐఏఎస్ లకు కరోనా సోకింది. ఐఏఎస్ అనుబంధ విభాగాలకు ఎంపికైన 480 మంది ట్రైనీ ఐఏఎస్ ల బృందం గుజరాత్ నుంచి ముస్సోరిలోని అకాడమీకి వచ్చింది. వీరికి డెహ్రాడూన్ రైల్వే స్టేషన్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. 84 మందికి కరోనా నిర్ధారణ అయింది.  
ఉత్తరాఖండ్ డీజీపీ ఆఫీసులో 24 మందికి కరోనా నిర్ధారణ
రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా అక్కడ... ఇక్కడ అన్న తేడా లేకుండా అన్నిచోట్లకూ విస్తరిస్తోంది. రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ అయిన డీజీపీ కార్యాలయంలో కూడా 25 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అయితే అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కరనా సోకిన వారితో వారం రోజులుగా సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. లేకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటించాలని డీజీపీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఆఫీసులో కరోనా సోకిన వారందరూ రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారు కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్య అధికారులు చెబుతున్నారు. 

 

ఇవి కూడా చదవండి

ఏపీలో 10వేలు దాటిన కరోనా కేసులు..

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కీలక ప్రకటన

20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..

ప్రగతి భవన్ వద్ద జేసీ దివాకర్ రెడ్డి హల్చల్

Tagged cases, corona, Dehradun, COVID19, IAS, Mussoorie, trainee IASLal Bahadur Shastri National Academy, LBSNA

Latest Videos

Subscribe Now

More News