అన్నదాత ఆగమాగం

అన్నదాత ఆగమాగం

మెదక్/రామచంద్రాపురం/ తూప్రాన్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. జిన్నారం, గుమ్మడిదల, పటాన్​చెరు, ఆర్సీపురం మండలాల పరిధిలో ఈదుల గాలులతో చెట్లు కూలిపోయాయి. రాళక్లత్వ, బొంతపల్లి ఏరియాల్లో వడగండ్లవానతో పంటలు దెబ్బతిన్నాయి.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పరిధిలోని దొంతి, చిన్నగొట్టిముకలో ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పలుచోట్లవడగళ్లుపడ్డాయి. బలమైన గాలులు వీయడంతో భీంలా తండాలో ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆయా గ్రామాల పరిధిలో పొలాల్లో కోసిపెట్టిన మెదలు తడిసిపోయాయి. తూప్రాన్ ,ఘన్‌పూర్, అల్లాపూర్, బ్రాహ్మణపల్లితో పాటు పలు గ్రామాల్లో మామిడి తోటలు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి . వర్షం కారణంగా పలు మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.