Heart Health: తీవ్రమైన ఛాతినొప్పి వస్తే.. వెంటనే రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి

Heart Health: తీవ్రమైన ఛాతినొప్పి వస్తే.. వెంటనే రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి

ఇటీవల కాలంలో అన్ని వయసుల వారిలో ఛాతినొప్పి వస్తోంది. విపరీతమైన ఛాతి నొప్పితో కొన్ని నిమిషాల్లోనే మరణానికి దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు.  పూర్తి ఆరోగ్యంగా ఉన్న యువకుల్లో కూడా ఛాతినొప్పి బారిన పడుతున్నారు. శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, మైకం, తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోతుంటారు. ఆకస్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పిని అనుభవిస్తే తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. 

ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు, పెర్కిర్డిటిస్, ధమనులకు సంబంధించిన కారణాలచేత ఈ ఛాతినొప్పికి కారణమవుతుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన ఛాతినొప్పికి అంతర్లీనంగా సంభవించే కారణాలపై ఆధారపడి చికిత్స ఉంటుంది. అది మందుల ద్వారా కంట్రోల్ కావొచ్చు లేదా సర్జరీ కూడా అవసరం పడొచ్చంటున్నారు. దురదృష్టవశాత్తు కొన్ని కేసుల్లో ఛాతినెప్పి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే మృత్యువాత పడుతున్నారని డాక్టర్లు అంటున్నారు. అయితే సరియైన చర్యలు తీసుకోవడం ద్వారా  ప్రాణాలు నిలబెట్టవచ్చని చెబుతున్నారు. 

ఆకస్మిక ఛాతినొప్పి సమయంలో చేయాల్సినవి:

325 mg డిస్ప్రిన్ ( కరిగే ఆస్పిరిన్), క్లోపిడోగ్రెల్ 4 మాత్రలు ఒకేసారి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇవి కెమిస్ట్ దగ్గర దొరుకుతాయి. గుండెపోటు ప్రమాదం ప్రతి వ్యక్తి ఈ మందులను తమ వద్ద ఉంచుకోవాలని చెబుతున్నారు. తీవ్రమైన ఛాతినొప్పి ఉన్నప్పుడు సోర్బిట్రేట్ (sorbitrate) ఉపయోగించవద్దని చెబుతున్నారు. ఇది బీపీ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. 

ఛాతినొప్పి వెంటనే వీలైనత త్వరగా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ చికిత్స అందించడం చాలా ముఖ్యం. గుండెపోటుకు సంబంధ పరీక్షలు చేయించాలి. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. పూర్తిస్థాయి గుండెపోటు ఉన్నట్లయితే కార్డియాలజిస్ట్ వెంటనే యాంజియోప్లాస్టీని సూచిస్తారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేయించడంఅనేది  గుండెపోటు ప్రాణాలను కాపాడేందుకు అత్యంత ఖచ్చితమైన సురక్షితమైన మార్గం.

ALSO READ: స్మోకింగ్ మానేయాలని అనుకుంటున్నారా.. అయితే ఇవి తినండి!

తక్షణమే యాంజియోప్లాస్టీకి వెళ్లడం ద్వారా చాలా ప్రయోజనం పొందవచ్చు. ఇది చాలా గుండె కండరాలు చనిపోకుండా నిరోధిస్తుంది. గుండె పంపింగ్ పనితీరును సంరక్షిస్తుంది. గుండెపోటు తర్వాత దీర్ఘకాలిక మనుగడను అంచనా వేసే వాటిలో యాంజియోప్లాస్టీ ఒకటి.