
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు హౌస్ లోని తన ఛాం బర్ లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్ర మానికి ఆమె భర్త నారాయణ మూర్తి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత శుక్రవారం కేంద్రం ఆమెను రాజ్య సభకు నామినేట్ చేసింది. కాగా, సుధామూ ర్తి పిల్లలకు సంబంధించిన అనేక పుస్తకాల ను రచించారు. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యం లో విశేష కృషి చేశారు. అందుకు గాను సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కా రాన్ని అందుకున్నారు.