ఆ అమ్మాయి.. వెరీ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆ అమ్మాయి.. వెరీ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సుధీర్ బాబు, కృతీశెట్టి జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. మైత్రి మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి బి.మహేంద్ర బాబు, కిరణ్ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న విడుదల. నిన్న ‘మీరే హీరోలా ఉన్నారు’ అనే పాటను రిలీజ్ చేశారు. అతిథిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ ‘గ్రహణం సినిమా నుంచి నేను మోహనకృష్ణ గారికి ఫ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని. ఆయన ప్రతి సినిమా చాలా సహజంగా ఉంటుంది’ అన్నాడు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘చక్కని ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామా. లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోరీ ఉన్నప్పటికీ ఫ్యామిలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఎక్కువ కనెక్టవుతుంది. సినిమా చాలా రిచ్‌గా వచ్చింది. మోహనకృష్ణ గారి నుంచి చాలా నేర్చుకున్నా. కృతి అద్భుతంగా నటించింది. పాటలన్నీ బాగా కుదిరాయి.

ఈ పాటను జర్నలిస్టులకు డెడికేట్ చేస్తున్నాం’ అన్నాడు. ‘డాక్టర్ అవ్వాలనే నా కల ఈ సినిమాలో నెరవేరింది. టీమ్‌కి థ్యాంక్స్’ అంది కృతి. దర్శకుడు మాట్లాడుతూ ‘క్లిష్టమైన అమ్మాయి కథ ఇది. ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా సెటిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చెబుతానని నాపై కంప్లైంట్ ఉంది. కానీ నేను తీసిన వాటిలో ఇది మోస్ట్ ఎమోషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీ. ప్రేక్షకులు ఇక ప్రేమకథలు చూడరనే చర్చ మొదలవుతున్న సమయంలో కంటెంట్ బాగుంటే చూస్తారని ‘సీతారామం’తో హను ప్రూవ్ చేశాడు. అదే తరహాలో కుటుంబమంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ రిలేషన్స్, ఎమోషన్స్ గురించి సహజత్వానికి దగ్గరగా చెప్పడానికి ప్రయత్నించాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, డీవోపీ పీజీ విందా, ప్రొడ క్షన్ డిజైనర్ సాహి సురేష్, సమర్పకులు గాజులపల్లి సుధీర్ బాబు పాల్గొన్నారు.