శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌లో రూపొందిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించగా, టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 25న సినిమా రిలీజ్. ఈ క్రమంలో శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ఈ మూవీ ట్రైలర్ చూశా. శివ, నితిన్ ప్రసన్న ఎంతో ఇంటెన్స్‌గా నటించారు. ఈ మూవీ చాలా కొత్తగా, రీ ఫ్రెషింగ్‌గా ఉండబోతోందనిపిస్తోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా.
పెద్ద సినిమాలే కాదు.. చిన్న చిత్రాలు, మీడియం చిత్రాలే ఇండస్ట్రీని నడిపిస్తాయి’ అని చెప్పాడు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకులు వీరశంకర్, శ్రీరామ్ ఆదిత్య, యాక్టర్స్ వీజే సన్నీ, వితిక షెరు సినిమా సక్సెస్ సాధించాలని టీమ్‌కు విషెస్ తెలియజేశారు. ఈ ప్రాజెక్టుకు తమను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరో హీరోయిన్. మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం అని దర్శక నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.