Mama Mascheendra Movie Review: లాజిక్ లేని కన్ఫ్యూజన్ డ్రామా.. సుధీర్ బాబు ట్రిపుల్ ట్రీట్ ఎలా ఉందంటే?

Mama Mascheendra Movie Review: లాజిక్ లేని కన్ఫ్యూజన్ డ్రామా.. సుధీర్ బాబు ట్రిపుల్ ట్రీట్ ఎలా ఉందంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) త్రిపాత్రాభినయం చేసిన మూవీ మామా మశ్చీంద్ర(Mama Mascheendra Movie). నటుడు హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ సినిమాను.. సునీల్ నారంగ్,  పుస్కుర్ రామ్ మోహన్ రావు సమ్యుక్తంగా నిర్మించారు.  టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆసక్తి పెంచిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుధీర్ బాబు హిట్టు కొట్టాడా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.  

కథ: పరశురామ్ (సుధీర్ బాబు).. ఆస్తి కోసం సొంత చెల్లెలు కుటుంబాన్ని చంపమని దాసు (హర్షవర్ధన్)ను పంపిస్తాడు. కానీ వాళ్ళు తప్పించుకుంటారు. తరువాత కొన్నేళ్ళకు పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా) రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడుతుంది. అలాగే దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి), ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న పరశురామ్ ... తన పోలికలతో పుట్టిన మేనల్లుళ్లు తనపై పగ తీర్చుకోవాడానికే ప్రేమ పేరుతో నాటకం ఆడుతున్నారని అనుకుంటాడు. దాంతో వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తాడు. మరి పరశురామ్ మేనల్లుళ్లు నిజంగా పాగా తీర్చుకోవడం కోసమే ఆ పని చేశారా? అసలు ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: సినిమాల్లో వచ్చే ట్విస్టులను ప్రేక్షకులు చాల బాగా రిసీవ్ చేసుకుంటారు. కానీ అవి ఎక్కువైతేనే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ చిన్న లాజిక్ ను మిస్ అయ్యాడు మామా మశ్చీంద్ర దర్శకుడు హర్షవర్ధన్. పోనీ.. ఏ సినిమాలో కొత్త ట్విస్టులు ఏమైనా ఉన్నాయా అంటే అది లేదు. అవి కూడా పాత చింతకాయ పచ్చడిలాగే ఉంటాయి. ఆ ట్విస్టులు కారణంగా ఒకానొక సమయంలో అసలు ఎం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. 

అయితే హీరోను ఒకటి కంటే ఎక్కువ గెటప్స్ లో చూపించాలని, ఆక్రమంలో ట్విస్టులు ఉండాలని ఫిక్స్ అయ్యారో ఏమో తెలియదు కానీ.. కథను ఆసక్తికరంగా మలచడంలో ఫెయిల్ అయ్యారు. నిజానికి హర్షవర్ధన్ కన్ఫ్యూజన్ కామెడీని చాలా బాగా డీల్ చేయగలడు. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది. సినిమాలో నవ్వించే సీన్స్ వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. అంతేకాదు సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యారు. అవి ఆడియన్స్ పేషన్స్ ను పరిక్షిస్తాయి. కన్ఫ్యూజన్ డ్రామా తీద్దాం అనుకున్న దర్శకుడు కన్ఫ్యూజన్ లో పడిపోయాడు.     

ALSO READ : సుష్మా స్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా.? : కిషన్ రెడ్డి.

నటీనటులు: మూడు పాత్రల్లో సుధీర్ బాబు నటన బాగుంది అంతే. కొత్తగా చూపించింది ఏమీ లేదు. ఇక ముసలి పాత్ర,  లడ్డు బాబు పాత్రల్లో ఆయన మేకప్, లుక్ అస్సలు సెట్ అవలేదు. ఇక ముసలి పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం కూడా బాలేదు. ఇక హీరోయిన్స్ ఈషా రెబ్బా, మృణాళిని రవి నటన కూడా సో సో గానే ఉంది. దర్శకుడిగా కంటే నటుడిగా మెప్పించారు హర్షవర్ధన్. ఇక మిగిలిన పాత్రలు కూడా పరవాలేదు అనిపించాయి.  

ఇక చివరగా ఒక్క ముక్కలో చెప్పాలంటే.. కన్ఫ్యూజన్ డ్రామాతో ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసింది మామా మశ్చీంద్ర మూవీ.