వారి కోసమే షుగర్ ఫ్యాక్టరీలను తెరవడం లేదు

వారి కోసమే షుగర్ ఫ్యాక్టరీలను తెరవడం లేదు

జగిత్యాల జిల్లా: అధికార పార్టీ నేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసమే షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం లేదని తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఆరోపించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. వరి, మొక్కజొన్న వేయొద్దని ప్రభుత్వం చెప్పడంతో రైతులు చెరుకు సాగు చేస్తున్నారన్నారని ఆయన తెలిపారు. అయితే షుగర్ ఫ్యాక్టరీలు తెరవకపోవడంతో పండించిన పంటను ఏం చేయాలో రైతులకు తెలియడం లేదని చెప్పారు. అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని మాట ఇచ్చిన కేసీఆర్... ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల కష్టాలు గుర్తించి ఇప్పటికైనా షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

ఇవి కూడా చదవండి