
భారతదేశ చక్కెర రంగం రూ.1.3 లక్షల కోట్ల పరిశ్రమగా అభివృద్ధి చెందిందని, గ్రామీణాభివృద్ధి, ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం అన్నారు.
ఢిల్లీలో కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ 2025 అండ్ నేషనల్ ఎఫిషియెన్సీ’ అవార్డు వేడుకలో మంత్రి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశ చక్కెర రంగం ఎంతో ఎదిగిందని తెలిపారు.
కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి భారతదేశ చక్కెర రంగం వార్షిక పరిశ్రమగా రూ.1.3 లక్షల కోట్లకు విస్తరించిందని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి, ఇంధన స్వాతంత్ర్యం ,గ్రీన్ ఇంధన ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లడానికి విధాన సంస్కరణలను ఇది నిదర్శనం అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 11 సంవత్సరాలలో నాలుగు రెట్లు పెరిగి ఏటా 1,810 కోట్ల లీటర్లకు చేరుకుందన్నారు.
పెట్రోల్లో ఇథనాల్ కలపడం 1 .53 శాతం నుంచి 19శాతానికి పెరిగిందన్నారు. రికార్డు స్థాయిలో ఇథనాల్ బ్లెండింగ్, ఇంధనంలో ఆత్మనిర్భరత సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో–ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ నిర్వహించింది.